అనుచరులు

latex ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

కూడలి

Browsing "Older Posts"

శాంతి చిహ్నాల సమూహం.. మాకు కావాలి సొంతం!

17, డిసెంబర్ 2010, శుక్రవారం / No Comments

చెప్పుకోండి చూద్దాం 2

27, నవంబర్ 2010, శనివారం / 1 Comment
1 . 'ద్విజములు'  అని వేటిని అంటారు?

2 . బృందావనం ఏ నదీ తీరాన వున్నది?

౩. పదహారణాల తెలుగమ్మాయిని అర్ధణాలలో చెప్పాలంటే ఎలా చెప్పాలి ?

4 . ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఎవరస్ట్ ఎక్కడ వుంది?

5 . రచయితల వర్ణనల ప్రకారం ఆడవారి వద్దవున్న అణ్వాయుదాలకంటే బలమైన ఆయుధాలు ఏమిటి?

రోశయ్య రాజీనామాలు

24, నవంబర్ 2010, బుధవారం / No Comments
గత  కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న రాజకీయ సమీకరణాల వేడి నేటితో రగులుకుంది. వై.యస్.ఆర్ మరణానంతరం  ఊహించని విధంగా రాష్ట్ర  ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టిన రోశయ్య  అంతే ఊహించని విధంగా రాజీనామా తో నిష్క్రమించారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య  రాజకీయ, ఆర్ధిక కురు వృద్దుడిగా పేరుపొందిన రోశయ్య  ముఖ్యమంత్రి అయినందుకు ఎక్కువమంది ఆయన నుంచి  రాష్ట్రంలో  సానుకూల, ఆశావాహ పరిపాలనను ఆశించారు. కాని వాస్తవ చిత్రం అందుకు విరుద్దంగా ప్రతిబింబించింది.అందుకు కారణాలు అనేకం. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సమస్యలకు రోశయ్య ప్రభుత్వం యొక్క నాన్చుడు ధోరణి, ప్రతిదానికి సోనియా అమ్మ పై ఆధారపడటం, జవాబుదారిగా ఉండాల్సిన సమయంలో కూడా చాతుర్యంతో మాట్లాడుతున్నారనిపించే సమాధానాలు..ఇలా చాల మట్టుకు స్వయం కృతాలే  ఈ ప్రయాణంలో కనిపిస్తాయి. ప్రమాణ స్వీకారం నుండి రాజీనామా పత్రం వరకు ప్రతి కదలిక  హై కమాండ్ చేతిలోంచే జరగడంతో ఆయన రాజకీయ అనుభవంలో 10 % కూడా ఇన్నాళ్ళలో రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం లేకుండా పోయింది. సోనియా అమ్మ పుణ్యమా అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'పొట్టేళ్ల కుమ్ములాటలో లేగ దూడలా ' తయారయ్యింది. రోశయ్య స్థానంలో ఎవరు వచ్చినా వారుకూడా హై కమాండ్ చేతిలో రిమోట్ అయిపోతే మాత్రం ఇలాంటి పరిస్థితులు  ఇంతటితో ఆగవు సరికదా ఇలాంటి రోశయ్య రాజీనామాలు కొనసాగుతూనే వుంటాయి . ముగింపు:  రోశయ్య పరిపాలన అనుకున్నంత సవ్యంగా జరగక పోవడానికి ప్రధాన కారణం అనిపించే ఈ శ్రీధర్ కార్టూన్  నూటికి నూరు శాతం కరెక్ట్ అనిపిస్తుంది.
నీతి: మొక్కై వంగనిది  మ్రానై వంగునా.


ఫైట్ & డ్రింక్

/ No Comments
అతిగా మొగుడ్ని కొట్టిన ఆడది, అతిగా మందు కొట్టిన మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు.

క్వశ్చన్ అవర్ 1

17, నవంబర్ 2010, బుధవారం / 3 Comments
1 . క్రికెట్ బాల్, వాలీ బాల్, ఫుట్ బాల్ లలో బాగా తన్నులు తినేది ఏది?

2 . శాకాహారులు కూడా తినే కోడి ఏమిటి?

3 . పులి బిడ్డ, పిల్లి బిడ్డ, బల్లి బిడ్డలలో పెద్దైన తర్వాత కూడా పాకేది ఏ బిడ్డ?

4 . సూర్య వంశం లో పుట్టినా తన పేరులో చంద్రుని కలుపుకుని ప్రసిద్దికెక్కిన మహా పురుషుడు ఎవరు?

5 .'తోటికోడలి కోడలు' లో వున్న కొడుకు భార్య ఎవరు?

సెంటిమెంట్ - ఆయింట్మెంట్

/ No Comments
సెంటిమెంట్ దెబ్బకు ఆయింట్మెంట్ లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. మెదడులో పుట్టిన ఆలోచన బలంగా మనసులో  నాటుకుపోతే ఇక అక్కడ్నించి అది మనల్ని శాసించడం జరుగుతుంది. 
ఒక ఆఫీస్ లో  పి.ఏ గా పనిచేస్తున్న ఒకావిడకు తనతో పాటు పనిచేస్తున్న ఒకావిడ  ప్రవర్తనను  భరించడం  చాలా భయంకరమైన అనుభవం. ఆవిడ నసను భరించే వోపిక చచ్చిపోయిన పి.ఏ..  బాస్ కి ఏదో కారణం చెప్పి ఆ నస క్యాన్డేట్ కి,  ఆమె కు మధ్యలో ఒక గోడలాంటి బల్లను అడ్డంగా పెట్టుకుని ఊపిరిపీల్చుకుంది. ఆ రోజు నుంచి పి.ఏ కు ఉద్యోగంలో చేరిన  కొత్తలో హుషారుగా జాబ్ చేస్తున్న సేటిసిపెక్షన్. ఇది జరిగిన కొద్ది రోజులకు దురదృష్టవశాత్తూ పి.ఏ గారి తండ్రిగారు కాలం చేసారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 
ఆమె తిరిగి జాబ్ లోకి వచ్చిన వెంటనే చేసిన మొదటి  పని.. ఇంతక్రితం అడ్డుగా పెట్టుకున్న చెక్క గోడను తీయించెయ్యడం. అదేమని ఆరా తీస్తే..' తన సీట్ పక్కన ఆ చెక్క గోడ పెట్టుకున్నాకనే తన తండ్రిని పోగొట్టుకున్నాన'నేది ఆమె చెప్పిన సమాధానం. ఈ సెంటిమెంట్ ముందు మునపటి నస క్యాన్డేట్ ప్రవర్తనను భరించడం  పి.ఏ గార్కి  కష్టంగా అనిపించడంలేదు ఇప్పుడు. సెంటిమెంటా మజాకా.

మెనుగురు పురుగుల వేడి!

15, నవంబర్ 2010, సోమవారం / No Comments
అడవిలో ఒక రోజు పెద్ద వాన కురిసింది. ప్రకృతి ప్రతాపం కూడా అల్ప జీవుల పైనే అన్నట్టుగా చిన్న చిన్న జంతువులన్నీ ఆ వర్షానికి చెల్లాచెదురై పోయాయి . కొంతసేపటికి వర్షం వెలసింది. కానీ విపరీతమైన చలి ప్రారంభమయ్యింది. జంతువులన్నీ ఆ చలినుండి తమను తాము కాపాడుకోవడానికి ఆయా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ అడవిలో వున్న కోతుల గుంపు ఒకటి చలినుండి కాపాడుకోవడానికి దారులు వెతక సాగాయి. చీకటి పడింది. ఆ చీకటిలో మెనుగురు పురుగులు మెరుస్తూ అడవిలో ఎగురుతున్నాయి. కోతుల గుంపుకు వాటిని చూడగానే ఆలోచన వచ్చి ఆ మెనుగురు పురుగులను ఒక్కొక్కటిగా ఏరుకొచ్చి ఒక చోట గుంపుగా వేసి చుట్టూ చేరి చలికాచుకోసాగాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఒక రామచిలుక కోతుల అజ్ఞానానికి జాలిపడి "అవి నిప్పు కణికలు కాదు మెనుగురు పురుగులు. వాటితో వేడి పుట్టదు. ఈ అడవికి కొద్ది దూరంలో  ఒక పల్లె వుంది. అక్కడికి వెళితే నిప్పు దొరికే అవకాశం వుంది. ఎవరైనా వెళ్లి ఆ నిప్పు తెచ్చుకోండి. మీ చలి తగ్గుతుంది " అని సలహా ఇచ్చింది. "నిప్పుకి, మెనుగురు పురుగులకు తేడా తెలియనంత  మూర్ఖులమా మేము.. దీనిని పని పట్టాలిరా" అని అన్ని కోతులు కలసి ఆ రామ చిలుకను పట్టుకుని నేలకేసి  కొట్టి చంపేసాయి.
రాత్రి ఒక ఛానల్ లో భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అనే చర్చా కార్యక్రమంలో కొట్టుకుంటున్న వారిని  చూస్తుంటే ఎందుకో నాకు ఈ కథ గుర్తుకొచ్చింది. 

బాలల దినోత్సవం

13, నవంబర్ 2010, శనివారం / No Comments

చిట్టి చిలకమ్మా!
స్కూల్ కి వెళ్ళావా!
అల్లరి చేసావా!
టీచర్ తిట్టిందా!
కోపం వచ్చిందా! 
అమ్మకు చెప్పావా!
తన్నులు తిన్నావా! 

(నువ్వు  ర్యాంకులు తెచ్చుకోవాలని స్కూల్ కి పంపిస్తే అల్లరి చేస్తావా.. ఆయ్)
పెద్దల చేతుల్లో తమ భవిష్యత్తును బంధీ చేసుకున్న పిల్లలందరికీ  బాలల దినోత్సవ శుభాకాంక్షలు!

నవ్వుకుందాం రండి-1

/ No Comments
కార్తీకమాసం వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఫిల్మ్ & టీవి సెలెబ్రిటీస్ వనభోజనాలను కండక్ట్ చేసారు. ఎవరికి వారు వాళ్ళ స్టైల్ లో ఎలా మాట్లాడేస్తున్నారో చూడండి.

బాలకృష్ణ : వండు..! ఒక వంటే వండు. మరో వంట వండాలని చూస్తే..మూకుట్లోనే  మాడిపోతావ్...!

చిరంజీవి : ముక్కే కదాని తినేస్తే కోడిని కోస్తా!

నాగార్జున : హే.. పండు.. లే.. నోరు  తెరు..అక్కడ వాళ్ళందరూ తినేస్తున్నారు. పండూ .. నోరు తెరు పండూ!

వెంకి :ఏంట్రా..ఆ.. అందరి వంటలు లోట్టలేసుకుని తినేస్తున్నారు..మరి నా వంటకేం తక్కువరా వక్కడూ  తినట్లేదు? (ఉప్పు తక్కువ).

ఎన్.టి.ఆర్ : రేయ్..! నేను చేసే పులుసు లో స్పెషల్ గా ఉప్పు,కారాలు వెయ్యక్కర్లేదు. ఆల్రెడీ ఆ రెండూ మా బ్లడ్ లోనే వున్నాయి.

రాం చరణ్ : లెక్క ఎక్కువైనా  పరవాలేదు షేర్ఖాన్.. ఒకొక్క ఇస్తరి కాదు.. వంద ఇస్తర్లు ఒకేసారి వడ్డించు. (ఆకలి ఎక్కువగా వుంది)

ప్రభాస్ : ఉప్పేసి వక వంట వుప్పెయ్యకుండా ఒక వంట వండటం నాకు చేతకాదు.

మహేష్ బాబు : ఎవడు వండితే దిమ్మ తిరిగి నాలుక బ్లాకైపోద్దో వాడే పండుగాడు.

ప్రకాష్ రాజ్ : యె....యేయె..ఇదేదో ఉప్మా అనుకుని ఫెవికాల్ తినేసానురా. ఎసేయండ్ర ఆ ఫెవికాలోడ్ని .

వీళ్ళను చూసి టీవి వాళ్ళు కూడా ఇలా మొదలెట్టారు. 

యాంకర్ సుమ: 'బీన్స్' కింగ్ ఆఫ్ ఆల్ వేజిటేబ్ల్స్!

ఉదయభాను: 'ఘీ' .. దుమ్ము దులుపు లంచ్ పెట్టు!

సాయికుమార్ : కెవ్.. మాంచి పిచ్చెక్కే జామ్ సూప్!

ఓం కార్ : తింటే  తీట.. ఎలా తీరుతుందో చూద్దాం.

ప్రభాకర్ : తినేద్దాం.. ఊహూ .. నేను రెడీ మీరు రేడియా !

లైట్ తీస్కోండి గురూ!

నవ్వుకుందాం రండి!

11, నవంబర్ 2010, గురువారం / 2 Comments
కొన్ని సినిమా డైలాగ్స్ ని సరదాగా మార్చి చెప్పుకుంటే ఎలా నవ్వుకోవచ్చో చూడండి.

మగధీర - హోటల్ లో : సాంబార్ ఎక్కువైనా పర్వాలేదు ఒక్కొక్క ఇడ్లీ కాదు వంద ఇడ్లీలు ఒకేసారి పంపించు సర్వర్!

సింహ - కిచెన్ లో : నేను వండే టప్పుడు నీ స్టవ్ మాత్రమే పనిచెయ్యాలి. కాదని వేరే ఏది పనిచేసిన నెక్స్ట్ వంటకు నీ సిలిండర్ వుండదు!

నరసింహా - కిచెన్ లో: వుదికేది ఉడకక మానదు...  వుడకనిది ఎప్పటికి  వుడకదు. 

నరసింహా - బెడ్ రూం  లో: అతిగా మొగుడ్ని కొట్టిన ఆడది, అతిగా మందు కొట్టిన మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు.

బాష- బాత్రూంలో: అన్నా పందులే గుంపులుగా వస్తాయి... సింహం సింగిల్  గా వస్తుంది.

నరకాసురుల మధ్య దివాలి!

4, నవంబర్ 2010, గురువారం / 1 Comment
ప్రజలందరకి దీపావళి శుభాకాంక్షలు.  నరకాసురులు మిగిలేవున్న రోజుల్లో కూడా నరకాసుర వధకు గుర్తుగా దీపావళి జరుపుకుంటూ, శుభాకాంక్షలు చెప్పుకోవడం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న చందంగానే వుంటుంది.. ఒక్కసారి ఆలోచించండి. దీపావళి  కథ అందరికీ తెలిసే వుంటుంది. నరకాసురిని బారి నుండి ప్రజలను రక్షించడానికి అప్పుడు సత్యభామ నడుంకట్టి యుద్ధం చేసి అందరిని రక్షించింది. ఇది ఒకప్పటికి కథ.మరి ఇప్పటి నరకాసురుల సంగతేమిటి? రకరకాల కోణాలలో వీదికొక రాక్షసుడు వీరంగం చేస్తున్నాడు. ప్రతి ఒక్కడు ప్రజలపైన పడి బకాసురుల డ్యూటీ కూడా వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళందరి మధ్య మనం దీపావళి ఆనందంగా జరుపుకోవడమంటే ఒకప్పటి స్వాతంత్రానికి పరతంత్రంలో పండగ చేసుకోవడమే.  ఇలాంటి అసురుల నుండి  ప్రజల్ని రక్షించేందుకు ఎలాంటి సత్యభామలు పుట్టుకురావాలి? ఎప్పుడు పుట్టుకురావాలి? స్త్రీ శక్తికి ప్రతిరూపంగా నిలవాల్సిన  కొంతమంది... నరకాసురుల పంచన చేరడంతో  టపాకాయలు కొన్నవాడికి ఆటం బాంబు ఫ్రీ గా వచ్చినంత బలంగా తయారయ్యి వారి ఆగడాలకు మరింత వెసులుబాటు కలిగింది. మనకు అనుకూలంగా వుంటే జగన్నాటక సూత్రధారి, లేకపోతే కపటనాటక సూత్రధారి అనే భ్రమలో బతికెయ్యడం అందరికి అలవాటై పోయింది కాబట్టి ఈ విషయాలన్నీ మర్చిపోయి ఇలాగే బతికేద్దాం. తారాజువ్వలా  ఎగరలేక పోయినా ఎగురుతున్న దానిని చూసి మనం కూడా ఎగురుదాం అని ఆశిద్దాం. మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

యదా ప్రజ తధా రాజ!

3, నవంబర్ 2010, బుధవారం / 1 Comment
ప్రస్తుతం ప్రజల పరిస్థితి చూస్తుంటే (ప్రత్యేకించి తెలుగు ప్రజలు) చిన్నప్పటి ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక అడవిలో నాలుగు బలిష్టమైన ఎద్దులు కలసిమెలిసి ఐక్యంగా జీవిస్తున్నాయి. ఆ బలిష్టమైన ఎద్దులను చూసి ఒక నక్కకు,ఒక సింహానికి నోరూరింది. కండపుష్టి కలిగిన వాటి మాంసం తినాలని ఒకటే జిహ్వ. ఆప్రయత్నంలో ఎద్దులజోలికి వెళ్లి భంగపడటమే కాకుండా చావుతప్పి కన్నులొట్టబోయినంత పనయ్యింది ఆ రెండు దుష్టమృగాలకు. చివరకు ఆ నాలుగు కలిసి వుంటే వాటిని చంపుకు తినటం కాదుకదా కొన్నాళ్ళకు ఈ అడవిలో వుండడం కూడా కష్టమే అవుతుంది అని భయం కలిగింది నక్కకు. అందుకు ఒక ఉపాయం ఆలోచించి అమలుచేసింది. ఒకదానికి తెలియకుండా ఒకదానితో స్నేహం చేసి ఆ నాలుగు ఎద్దుల మధ్య శత్రుత్వాన్ని  పెంచడంలో సఫలీకృతం అయ్యింది జిత్తులమారి నక్క. ఆపై సింహాన్ని పురమాయించి ఒంటరి అయిపోయిన ఎద్దులను ఒక్కొక్కటిగా చంపుకుని తిని సంతృప్తి చెందాయి ఆ సింహం, ఆ నక్క. ప్రస్తుత పరిస్తితులలో ఇక్కడ అయ్యో పాపం అని ఎద్దుల పక్షాన మనం నిలబడకూడదు.  గొర్రె ఎప్పుడూ కసాయినే నమ్ముతుందనే విషయాన్ని ఇంకా చెప్పుకోవాల? ఎన్ని కసాయి చరిత్రలు చూసిన నిజం తెలుసుకోలేకపోతే అది దాని తప్పే. ఇక మిగిలింది ప్లాన్ ఎవరిది, పండగ ఎవరిది అనేది త్వరలోనే మూర్ఖపు జనాలకి ఎలాగూ అర్ధమవుతుంది. అప్పుడు కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి వుంటే వెళ్లి వోటు వేసిరావడం మినహా వీళ్ళు చెయ్యగలిగేది ఏమి వుండదు.  యదా ప్రజ తధా రాజ!

నాకు కొన్ని తిట్లు కావాలి నాన్నా!

30, అక్టోబర్ 2010, శనివారం / No Comments
ఉదయం ఐదు గంటల సమయం. టాం & జేర్రీలు తన చుట్టూ తిరుగుతూ పోట్లాడుకుంటున్నట్టుగా కలగంటున్నాడు టింకు! వాళ్ళ నాన్న ఆదుర్దాగా లేపుతున్నట్టుగా అనిపించి కళ్ళు నులుముకుంటూ లేచాడు. ఎదురుగా వాళ్ళ నాన్న మాంచి కద్దరు డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి వున్నాడు. 'ఏంటి నాన్నా అప్పుడే లేపేసావు?' అని అడిగాడు. 
'నాకు కొన్ని తిట్లు కావాలి రా'
'తిట్లా?'
'అవును'
'అదేంటి నాన్నా సిగ్గులేకుండా అలా అడిగావు?'
'అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పనురా .. కావాలి చెప్పు?'
'ఎందుకో చెప్పు నాన్నా?' రెట్టించాడు టింకూ.
'ఏం లేదు రా.. అన్ని  టివీ చర్చా కార్యక్రమాలలో ఇప్పటిదాకా మాట్లాడి మాట్లాడి..'
'మాట్లాడా? పోట్లాడా నాన్నా?'
'నీకు తెలిసీ ఎందుకురా అడుగుతావు.. పోట్లాడే!  నా దగ్గరున్న బూతులన్నీ అయిపోయాయి. మిగిలినవాళ్ళందరూ వరసబెట్టి నన్ను తిడుతుంటే నాదగ్గర మాటలు లేక..'
'మాటలు కాదు నాన్నా.. బూతులు'
'అవే.. అవిలేకే  నా మొఖం కెమేరాకు చూపించలేకపోతున్నానురా. నువ్వు గాని స్కూల్లో మీ ఫ్రెండ్స్  తిట్టుకునే నాలుగు కొత్త తిట్లు చెప్పావనుకో ఈ రోజు చర్చా కార్యాక్రమంలో నా తడాఖా చూపిస్తాను'
'అమ్మ దగ్గర మంచి తిట్లు వుంటాయి నాన్నా. రోజూ నిన్ను ఇంట్లోను, టివీలోను చూస్తూ చాలా తిడుతూ వుంటుంది.' 
'మ్.... మీ అమ్మ తిట్టేవన్నీ నావే రా .. నువ్వు టైం వేస్ట్ చెయ్యకు. అవతల లైవ్ కి టైం అవుతుంది.. తొందరగా చెప్పు.'
'మ్..కపి..కచ్చ...కనా..క...క...క...!'
'కపి..కచ్చ...కనా..క...క...క....! కొత్త తిట్టా?'
'అవును నాన్నా '
'అర్ధం తెలియకపోయినా  చాలా కొత్తగా వుందిరా ..మ్మ్..చాలా థాంక్స్..ఇవాళ్ళ లైవ్ లో దుమ్ము దులిపేస్తాను ' అంటూ తండ్రి వెళ్ళిపోయాడు. 
తండ్రి వెళ్ళగానే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు టింకూ ! టాం & జేర్రీలు మళ్ళీ కలలోకి వచ్చి..
'టింకూ మా ఇద్దరికీ తిట్టుకోవడానికి బూతులు లేక కొట్టుకుంటున్నామ్. మాక్కూడా కొన్ని నేర్పోచ్చుగా ' అన్నాయి.
'అది అందరికీ తెలిసినదే.. కాకపోతే 'క' భాషలో చెప్పాను. అయినా మీకు తిట్లు కావాలంటే న్యూస్ చానల్స్ లో వచ్చే చర్చాకార్యక్రమాలు చూడండి. డోంట్ డిస్టర్బ్ మి! అని కలలు కనడం మానేసి పడుకున్నాడు టింకూ !
 
(గుడ్ నైట్ .. నాక్కూడా నిద్రొస్తుంది)

పది కోతులకు ఒకే కొబ్బరి కాయ

29, అక్టోబర్ 2010, శుక్రవారం / 1 Comment
'కోతికి కొబ్బరికాయ దొరికినట్టు..' అని అప్పుడప్పుడు మనం అంటుంటాం.ఆ కొబ్బరికాయ దొరికినప్పుడు ఆ కోతి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఈ సామెతను కొంచెం మనం మాడిఫై  చేస్తే అదే కొబ్బరికాయ పది కోతులకు దొరికితే దేని  మానాన అది ఆ కొబ్బరికాయతో హడావిడి చేసే ఛాన్స్ వుంటే ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! ఔత్సాహిక సృజనాత్ములు కొందరు  2012 లో  యుగాంతం కాన్సెప్ట్ ని పట్టుకుని  హైదరాబాద్ ని ఆ సమయంలో ఊహించుకుని ఒక షార్ట్ ఫిల్మ్ తయారుచేసారు. ఈ పాటికే మీకు అర్ధమయ్యి వుంటుంది ఆ కొబ్బరికాయ ఏమిటో, ఆ కోతులేమిటో...! సేటిలైట్ విధి (హతివిది అనలేమిక్కడ) ఆ గ్రాఫిక్స్ విజువల్స్ ని తీసుకుని మన న్యూస్ చానల్స్ ఏ రేంజ్ లో రేచ్చిపోవాలో ఆ రేంజ్లో రెచ్చిపోయాయి. చానల్ రేంజ్ ని బట్టి రకరకాల అర్ధాలు వచ్చేలా క్యాప్షన్స్, హెడ్లైన్స్ .. ! బొంగురుపోయిన గొంతులకు మరింత బేస్ పెంచి వాయిస్ ఓవర్స్ ... ! అసలే ఈ  మధ్య కాలంలో వనస్థలిపురంలో అంతుచిక్కని శబ్దాలకు  జనం హడలి చస్తుంటే దానిని కూడా ఈ రొంపిలోకి లాగేసి ఇవి ఆ యుగాంతానికి సూచనలేనా అని సొంత పైత్యం జోడించి మరింత హడావిడి. సేటిలైట్ విధి (ఇక్కడ కూడా  హతివిది అనలేము). చివరగా నేను చెప్పొచ్చేదేంటంటే భగవంతుడు సృష్టించిన చావులాంటిది ఏదైనా వుంటే అది ఒకేసారి పోయేలా వుంటుంది కాని ఇంతటి నరకంగా మాత్రం కాదు. కోతినిసృష్టించింది దేవుడే.. కొబ్బరికాయను సృష్టించింది దేవుడే.. కాని ఇలా దాని హడావుడితో ఎదుటివాళ్ళను చంపమని మాత్రం కాదు.!

వరి పైరు

26, అక్టోబర్ 2010, మంగళవారం / No Comments
ఇప్పుడే జల్లెడలో  జాగా వొచ్చింది. ఇక నుంచి చిత్రాల కబుర్లతో మిమ్మల్నందరిని ఎప్పటికప్పుడు పలకరిస్తుంటాను.

పొట్టి గెల

25, సెప్టెంబర్ 2010, శనివారం / No Comments

ఆదివారం నాడు అరటి మొలిచింది.. గురువారం నాడు పొట్టి గెల వేసింది
ఆకాశం తాకాలా.. మందార పువ్వైనా

ఎంత బరువుందన్నది కాదన్నయ్యా.. గోదారి దాటామా లేదా అన్నదే పాయింటు..!
పచ్చని తివాచీలపై వెచ్చని కిరణాల బడలిక

ముప్పావలా కోడి

/ No Comments
భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు ... మరి వంద సార్లు చెబితే ఎన్ని సార్లు చెప్పినట్టు? ***  పదివేల సార్లు!

అత్తా ఒకింటి కోడలే అని ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఎప్పుడు? ***  మీరు అత్తగా మారినప్పుడు!

  ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని మనం బతిమాలుతున్నామంటే కచ్చితంగా మనం ఏం పట్టుకున్నామని అర్థం ? *** చేతులు !

 ముప్పావలా కోడి మిస్సయ్యిందని రూపాయి పావలా ఇన్వెస్టిగేషన్ చేయిస్తే మొత్తం ఎంత లాసైనట్టు? *** రెండు రూపాయలు !

'గురువుకి ఏం తెలుసు పుస్తకాల బరువు' -  ఈ కొటేషన్ ఎవరిదయ్యుంటుంది? *** స్టూడెంట్

గోదారి చిత్రాలు

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం / No Comments
నా పేరు కు ప్రతిరూపం గా నిలిచే అందాల  గోదారి చిత్రాలు
... వెన్నెల గోదారి !

ఒక పక్క  సూర్యుడు, ఒక పక్క పచ్చని పైరు.. వారిద్దరిని చూస్తున్నట్టుగా కుడి మూల ఇంద్రధనస్సు.

సాయంకాలం పూట మర్రిచెట్టు గుబురులోంచి గోదారిలో ఎల్తున్న మర పడవను చూస్తే...ఇలా వుంటుంది!




గోదారి మధ్యలోంచి సుడిగుండాల సాక్షిగా అస్తమిస్తున్న సూరీడు ఇలా వున్నాడు.


నేను పుట్టాను

/ No Comments
నమస్కారం !
నేను తెలుగు అంతర్జాలం లో ఇప్పుడే పుట్టిన బ్లాగర్ ని ........
వెన్నెల గోదారి - నా పేరు .
ఇకనుంచి మీ దారిలో నేను కూడా చేరి నిత్యం గోదారి పరవళ్ళు లా పలకరించటానికి ప్రయత్నిస్తాను.

కృతజ్ఞలతో ....
మీ వెన్నెల గోదారి