అనుచరులు

latex ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

కూడలి

Browsing "Older Posts"

పాంచ్ పంచ్

28, సెప్టెంబర్ 2011, బుధవారం / No Comments
హలో నమస్తే.. మిమ్మల్ని అలరించడానికి మీముందుకు వొచ్చింది  మీ అభిమాన కార్యక్రమం 'పాంచ్ పంచ్'. ఈ గేమ్ షో లో ఐదు ప్రశ్నలు వుంటాయి. అంటే మేము మిమ్మల్ని ఐదు ప్రశ్నలు అడుగుతాము. మీరు కరెక్ట్ సమాధానం చెప్పే ఒక్కొక్క ప్రశ్నకు మేము మీకు ఒక్కొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాము. అంటే మీరు ఐదు సమాధానాలు కరెక్ట్ గ చెబితే ఐదు ప్రత్యేక కృతజ్ఞతలు మీ  సొంతం చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు గేమ్ స్టార్ట్ చేసేద్దామ? 

౧. మన చేతిని 'ముష్టి' అని ఎప్పుడు అంటాము?
   జ: 
౨. 'మీ భవిష్యత్తు మీరు కనే కలలపై ఆధారపడి వుంటుంది' అని టీచర్ అన్న వెంటనే అతి తెలివి విద్యార్ధి ఏం చేస్తాడు?
  జ: 
౩. మీకు ఒకే అన్నయ్య.. మీ చెల్లి కి మాత్రం ఇద్దరు అన్నయ్యలు అంటే మీ కుటుంబంలో మీరు ఎన్నో సంతానం ?
జ: 
౪. మనం పుట్టిన వెంటనే ఒకరు చెప్పక్కర్లేకుండా చేసే పనులు రెండు.. ఆందులో మొదటిది గాలి పీల్చడం. రెండోది ఏమిటి?
జ: 
౫. రెండు గోడలు కలిసే ప్రదేశం తో  వచ్చేది నా జన్మ నక్షత్రం. అది ఏమిటి?
జ: 
*గమనిక : ఈ గేమ్ షో లో బ్రేక్ తర్వాత చూట్టానికి ఏమి వుండదు. కాబట్టి మీ సమాధానాల్ని యిప్పుడే చెప్పేయాలి.

దీనిని ఎలా చదవాలి / ఎంత అని అనాలి?

27, సెప్టెంబర్ 2011, మంగళవారం / 2 Comments
దీనిని ఎలా చదవాలి / ఎంత అని అనాలి? 
ఈ మధ్య నాకు వచ్చిన మెయిల్ లో ఈ ఇమేజ్ మన కరప్షన్ రేంజ్ ని మరో సారి గుర్తుచేసింది .. కాని ఈ మొత్తం స్కాం ని ఎన్ని కోట్లు అనాలో నాకు తెలియలేదు. ఎవరికైన తెలిస్తే ఈ సంఖ్య ను / మొత్తాన్ని  ఎలా చదవాలో చెప్పండి.