అనుచరులు

latex ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

కూడలి

Browsing "Older Posts"

కవల కోడిపిల్లలు

26, మార్చి 2011, శనివారం / 3 Comments

నాకొక డౌట్ వచ్చింది. దానిగురించి రెండు రోజులుగా, రెండు మూడు రకాలుగా ఆలోచిస్తుంటే జుట్టు రాలిపోవడం మినహా కరెక్ట్ పరిష్కారం దొరకట్లేదు.మీలో ఎవరైనా నా డౌట్ ని క్లియర్ చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్!
అసలు నా సందేహం ఏమిటంటే..
"కవల కోడిపిల్లలు అని వేటిని అంటారు?"
ఆప్షన్స్ :- 
A   ఒకే కోడి కి పుట్టిన కోడి పిల్లలు 
B   ఒకే గుడ్డులోనుండి పుట్టిన కోడి పిల్లలు
C   ఒకే పోలికలు వున్నా కోడి పిల్లలు 
ఎన్ని రకాలుగా ఆలోచించిన కరెక్ట్ లాజిక్ తో కూడిన సమాధానం దొరకట్లేదు. మీకేమయిన తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో పెట్టేయండే..ప్లీజ్ !

బొంగరాల పాట!

11, మార్చి 2011, శుక్రవారం / No Comments
బ్లాగరులందరికి శనివారం శుభాకాంక్షలు! ప్రతిరోజు క్రమం తప్పకుండ టపాలు రాసి  మీతో నిరంతర అంతర్జాల ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరడం లేదు .
గత టపాలో మట్టిబొంగారాల తయారి, బొంగరాల  పోటీ గురించి రాసాను గాని ఆ పోటీలో బొంగరాలను ఉత్సాహ పరిచేందుకు పోటీదారులు (పెద్దలు కాదు బుడతలు) పాడే పాట గురించి రాయడం మర్చిపోయాను. చిన్న పిల్లలు ఏదైనా పని చెయ్యకపోతే పెద్దవాళ్ళు వారికి తాయిలాలు (బెల్లం ముక్క, వేపుడు శనగపప్పు, పటిక బెల్లం...)  ఇస్తానని ఆశ పెడతారు. బహుశ దాని ఇన్స్పిరేషన్ అయ్యుంటుంది... ఎవరికి వారు తమ బొంగారాలకు ఇవ్వబోయే తాయిలాలను చెబుతూ ఈ పాట పాడతారు. ....

పాలకొల్లెల్లి   పప్పలు తెస్తాను గుక్కెట్టే బొంగరం!
ఆచంటేల్లి   అరిసెలు తెస్తాను గుక్కెట్టే బొంగరం!
కాకినాడెల్లి కాజాలు తెస్తాను గుక్కెట్టే బొంగరం!
కొవ్వురెల్లి కూల్ డ్రింక్ తెస్తాను గుక్కెట్టే బొంగరం!
భీమారమెల్లి బిందెలు తెస్తాను గుక్కెట్టే బొంగరం!
రాజోలెల్లి రంగులు తెస్తాను గుక్కెట్టే బొంగరం!
చీరాలెల్లి చీరలు తెస్తాను గుక్కెట్టే బొంగరం!
వల్లూరెల్లి పువ్వులు తెస్తాను గుక్కెట్టే బొంగరం!
.........
* పాలకొల్లు, ఆచంట, కాకినాడ, కొవ్వూరు, భీమవరం, రాజోలు, చీరాల, వల్లూరు... ఇవన్నీ మాకు తెలిసిన చుట్టుపక్కల ఊరు పేర్లు.
* ఇక్కడ  'గుక్కెట్టే బొంగరం' అంటే చిన్న పిల్లలు ఆగకుండా  గుక్కపెట్టి ఏడవడం లాగ  బొంగరం కూడా ఆగకుండా తిరగాలని బుడతల రిక్వెస్ట్ .
* ఇన్ని ఊళ్ళు తిరిగి తెచ్చే పప్పలు (తినుబండారాలు) ,చీరలు, పువ్వులు  అది ఏం చేసుకుంటుంది అని మాత్రం అడగొద్దు. ఇలాంటివన్నీ  ఆశ చూపిస్తే బాగా తిరుగుతుందేమో, నన్ను గెలిపిస్తుందేమోనని పిల్లల ఆశ.