అనుచరులు

latex ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

కూడలి

Browsing "Older Posts"

ఒక సారి ట్రై చేసి చూడండి

2, జూన్ 2011, గురువారం / No Comments
కంప్యూటర్ మీద బిజీ గ వర్క్ చేస్తున్నాను. నాకు మౌస్ ఉపయోగించడం కంటే ఎక్కువ కీ బోర్డు commands తో వర్క్ చెయ్యడం ఇష్టం. word  లో లెటర్ టైపు చేస్తూ  ఏ కమాండ్ కొట్టానో తెలీదు సడన్ గా ఒక్క సెకను స్క్రీన్ black  అయిపొయింది. తర్వాత word  document  మొత్తం రివెర్స్ లో తలక్రిందులుగా  మారిపోయింది. ఏమయ్యిందో తెలీదు. type  చేస్తుంటే అక్షరాలు రివర్స్  లోనే పడుతున్నాయి. ctrl + z  కమాండ్ పనిచేస్తుంది కదాని  నొక్కుతుంటే డేటా వరకు undo  అవుతుంది గాని విండో మాత్రం మామూలు స్థితి  కి రావట్లేదు. ఆఖరికి కీ బోర్డు పై రక రకాల ప్రయోగాలు చేస్తే నేను యిచ్చిన కమాండ్ ఏంటో తెలిసింది. 
ctrl  + alt + down arrow  నొక్కాను. ఆ కమాండ్ కి విండో మొత్తం rivers  అయిపొయింది. తర్వాత ctrl + alt  + up  arrow  కొడితే మామూలు position  కి వచ్చేసింది. కాసేపు కంగారు పెట్టిన కమాండ్ తెలిసిన తర్వాత భలే బాగుందనిపించింది. ఈ కమాండ్ మీకు యిదివరకే తెలిస్తే ఓకే. లేదంటే ఒక సారి ట్రై చేసి చూడండి.