ఒక సారి ట్రై చేసి చూడండి
కంప్యూటర్ మీద బిజీ గ వర్క్ చేస్తున్నాను. నాకు మౌస్ ఉపయోగించడం కంటే ఎక్కువ కీ బోర్డు commands తో వర్క్ చెయ్యడం ఇష్టం. word లో లెటర్ టైపు చేస్తూ ఏ కమాండ్ కొట్టానో తెలీదు సడన్ గా ఒక్క సెకను స్క్రీన్ black అయిపొయింది. తర్వాత word document మొత్తం రివెర్స్ లో తలక్రిందులుగా మారిపోయింది. ఏమయ్యిందో తెలీదు. type చేస్తుంటే అక్షరాలు రివర్స్ లోనే పడుతున్నాయి. ctrl + z కమాండ్ పనిచేస్తుంది కదాని నొక్కుతుంటే డేటా వరకు undo అవుతుంది గాని విండో మాత్రం మామూలు స్థితి కి రావట్లేదు. ఆఖరికి కీ బోర్డు పై రక రకాల ప్రయోగాలు చేస్తే నేను యిచ్చిన కమాండ్ ఏంటో తెలిసింది.
ctrl + alt + down arrow నొక్కాను. ఆ కమాండ్ కి విండో మొత్తం rivers అయిపొయింది. తర్వాత ctrl + alt + up arrow కొడితే మామూలు position కి వచ్చేసింది. కాసేపు కంగారు పెట్టిన కమాండ్ తెలిసిన తర్వాత భలే బాగుందనిపించింది. ఈ కమాండ్ మీకు యిదివరకే తెలిస్తే ఓకే. లేదంటే ఒక సారి ట్రై చేసి చూడండి.

No Comment to " ఒక సారి ట్రై చేసి చూడండి "