యదా ప్రజ తధా రాజ!
ప్రస్తుతం ప్రజల పరిస్థితి చూస్తుంటే (ప్రత్యేకించి తెలుగు ప్రజలు) చిన్నప్పటి ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక అడవిలో నాలుగు బలిష్టమైన ఎద్దులు కలసిమెలిసి ఐక్యంగా జీవిస్తున్నాయి. ఆ బలిష్టమైన ఎద్దులను చూసి ఒక నక్కకు,ఒక సింహానికి నోరూరింది. కండపుష్టి కలిగిన వాటి మాంసం తినాలని ఒకటే జిహ్వ. ఆప్రయత్నంలో ఎద్దులజోలికి వెళ్లి భంగపడటమే కాకుండా చావుతప్పి కన్నులొట్టబోయినంత పనయ్యింది ఆ రెండు దుష్టమృగాలకు. చివరకు ఆ నాలుగు కలిసి వుంటే వాటిని చంపుకు తినటం కాదుకదా కొన్నాళ్ళకు ఈ అడవిలో వుండడం కూడా కష్టమే అవుతుంది అని భయం కలిగింది నక్కకు. అందుకు ఒక ఉపాయం ఆలోచించి అమలుచేసింది. ఒకదానికి తెలియకుండా ఒకదానితో స్నేహం చేసి ఆ నాలుగు ఎద్దుల మధ్య శత్రుత్వాన్ని పెంచడంలో సఫలీకృతం అయ్యింది జిత్తులమారి నక్క. ఆపై సింహాన్ని పురమాయించి ఒంటరి అయిపోయిన ఎద్దులను ఒక్కొక్కటిగా చంపుకుని తిని సంతృప్తి చెందాయి ఆ సింహం, ఆ నక్క. ప్రస్తుత పరిస్తితులలో ఇక్కడ అయ్యో పాపం అని ఎద్దుల పక్షాన మనం నిలబడకూడదు. గొర్రె ఎప్పుడూ కసాయినే నమ్ముతుందనే విషయాన్ని ఇంకా చెప్పుకోవాల? ఎన్ని కసాయి చరిత్రలు చూసిన నిజం తెలుసుకోలేకపోతే అది దాని తప్పే. ఇక మిగిలింది ప్లాన్ ఎవరిది, పండగ ఎవరిది అనేది త్వరలోనే మూర్ఖపు జనాలకి ఎలాగూ అర్ధమవుతుంది. అప్పుడు కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి వుంటే వెళ్లి వోటు వేసిరావడం మినహా వీళ్ళు చెయ్యగలిగేది ఏమి వుండదు. యదా ప్రజ తధా రాజ!

very good post
రిప్లయితొలగించండి