అనుచరులు

latex ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

కూడలి

రోశయ్య రాజీనామాలు

గత  కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న రాజకీయ సమీకరణాల వేడి నేటితో రగులుకుంది. వై.యస్.ఆర్ మరణానంతరం  ఊహించని విధంగా రాష్ట్ర  ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టిన రోశయ్య  అంతే ఊహించని విధంగా రాజీనామా తో నిష్క్రమించారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య  రాజకీయ, ఆర్ధిక కురు వృద్దుడిగా పేరుపొందిన రోశయ్య  ముఖ్యమంత్రి అయినందుకు ఎక్కువమంది ఆయన నుంచి  రాష్ట్రంలో  సానుకూల, ఆశావాహ పరిపాలనను ఆశించారు. కాని వాస్తవ చిత్రం అందుకు విరుద్దంగా ప్రతిబింబించింది.అందుకు కారణాలు అనేకం. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సమస్యలకు రోశయ్య ప్రభుత్వం యొక్క నాన్చుడు ధోరణి, ప్రతిదానికి సోనియా అమ్మ పై ఆధారపడటం, జవాబుదారిగా ఉండాల్సిన సమయంలో కూడా చాతుర్యంతో మాట్లాడుతున్నారనిపించే సమాధానాలు..ఇలా చాల మట్టుకు స్వయం కృతాలే  ఈ ప్రయాణంలో కనిపిస్తాయి. ప్రమాణ స్వీకారం నుండి రాజీనామా పత్రం వరకు ప్రతి కదలిక  హై కమాండ్ చేతిలోంచే జరగడంతో ఆయన రాజకీయ అనుభవంలో 10 % కూడా ఇన్నాళ్ళలో రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం లేకుండా పోయింది. సోనియా అమ్మ పుణ్యమా అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'పొట్టేళ్ల కుమ్ములాటలో లేగ దూడలా ' తయారయ్యింది. రోశయ్య స్థానంలో ఎవరు వచ్చినా వారుకూడా హై కమాండ్ చేతిలో రిమోట్ అయిపోతే మాత్రం ఇలాంటి పరిస్థితులు  ఇంతటితో ఆగవు సరికదా ఇలాంటి రోశయ్య రాజీనామాలు కొనసాగుతూనే వుంటాయి . ముగింపు:  రోశయ్య పరిపాలన అనుకున్నంత సవ్యంగా జరగక పోవడానికి ప్రధాన కారణం అనిపించే ఈ శ్రీధర్ కార్టూన్  నూటికి నూరు శాతం కరెక్ట్ అనిపిస్తుంది.
నీతి: మొక్కై వంగనిది  మ్రానై వంగునా.


Share This:

No Comment to " రోశయ్య రాజీనామాలు "