నవ్వుకుందాం రండి-1
కార్తీకమాసం వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఫిల్మ్ & టీవి సెలెబ్రిటీస్ వనభోజనాలను కండక్ట్ చేసారు. ఎవరికి వారు వాళ్ళ స్టైల్ లో ఎలా మాట్లాడేస్తున్నారో చూడండి.బాలకృష్ణ : వండు..! ఒక వంటే వండు. మరో వంట వండాలని చూస్తే..మూకుట్లోనే మాడిపోతావ్...!
చిరంజీవి : ముక్కే కదాని తినేస్తే కోడిని కోస్తా!
నాగార్జున : హే.. పండు.. లే.. నోరు తెరు..అక్కడ వాళ్ళందరూ తినేస్తున్నారు. పండూ .. నోరు తెరు పండూ!
వెంకి :ఏంట్రా..ఆ.. అందరి వంటలు లోట్టలేసుకుని తినేస్తున్నారు..మరి నా వంటకేం తక్కువరా వక్కడూ తినట్లేదు? (ఉప్పు తక్కువ).
ఎన్.టి.ఆర్ : రేయ్..! నేను చేసే పులుసు లో స్పెషల్ గా ఉప్పు,కారాలు వెయ్యక్కర్లేదు. ఆల్రెడీ ఆ రెండూ మా బ్లడ్ లోనే వున్నాయి.
రాం చరణ్ : లెక్క ఎక్కువైనా పరవాలేదు షేర్ఖాన్.. ఒకొక్క ఇస్తరి కాదు.. వంద ఇస్తర్లు ఒకేసారి వడ్డించు. (ఆకలి ఎక్కువగా వుంది)
ప్రభాస్ : ఉప్పేసి వక వంట వుప్పెయ్యకుండా ఒక వంట వండటం నాకు చేతకాదు.
మహేష్ బాబు : ఎవడు వండితే దిమ్మ తిరిగి నాలుక బ్లాకైపోద్దో వాడే పండుగాడు.
ప్రకాష్ రాజ్ : యె....యేయె..ఇదేదో ఉప్మా అనుకుని ఫెవికాల్ తినేసానురా. ఎసేయండ్ర ఆ ఫెవికాలోడ్ని .
వీళ్ళను చూసి టీవి వాళ్ళు కూడా ఇలా మొదలెట్టారు.
యాంకర్ సుమ: 'బీన్స్' కింగ్ ఆఫ్ ఆల్ వేజిటేబ్ల్స్!
ఉదయభాను: 'ఘీ' .. దుమ్ము దులుపు లంచ్ పెట్టు!
సాయికుమార్ : కెవ్.. మాంచి పిచ్చెక్కే జామ్ సూప్!
ఓం కార్ : తింటే తీట.. ఎలా తీరుతుందో చూద్దాం.
ప్రభాకర్ : తినేద్దాం.. ఊహూ .. నేను రెడీ మీరు రేడియా !
లైట్ తీస్కోండి గురూ!

No Comment to " నవ్వుకుందాం రండి-1 "