శ్రీమతి ఊరేలితే ?
ఇంట్లో భార్యలు ఉన్నంత వరకు భర్తలకు భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండదు. ఒకవేళ ఆమె బయటకు వెళ్ళినప్పుడు భర్తలకు కంచం కంటే ముందు కిచెన్ రూం గుర్తుకొస్తుంది.బ్యాచిలర్స్ గ వున్నప్పుడు కొద్దో గొప్పో వంటగది పరిచయం వుంటే పర్వాలేదు. లేకపోతే పరిస్థితి ఎలా వుంటుందో చెప్పక్కర్లేదు. ఏం వండుకోవాలి? ఎలా వండుకోవాలి? అసలు వండుకోవాల ? వద్దా? వండుకుంటే ఆ వంట ఎలా ఉండొచ్చు? ఆ వండింది మనం తింటామ? కుక్కలు, పిల్లులు కూడా ముట్టుకోకపోతే చెత్త బుట్టకు అర్పిస్తామ? ఇలా అనేక ప్రశ్నలు మనం భోజనం చెయ్యడానికంటే ముందు మనల్ని భోంచేస్తాయి. ఇలాంటి సందర్భంలో మగమహారాజుల అత్యధికంగా ఎటువైపు మొగ్గు చూపిస్తారో తెలుసుకునే చిన్న ప్రయత్నం ఇది. ఇక్కడ పురుషులే తమ అభిప్రాయాలను తెలియచేయ్యాలనే రూల్ లేదు. మీరు ఇంట్లో లేనపుడు మీ వారు ఎలా తింటారో తెలుసుకాబట్టి మహిళలు కూడా వోటు వెయ్యవచ్చు.

No Comment to " శ్రీమతి ఊరేలితే ? "