అనుచరులు

latex ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.

కూడలి

మట్టి బొంగరం!

ఇప్పుడంటే మార్కెట్ లో రెడి మేడ్ చెక్క బొంగరాలు, ప్లాస్టిక్ బొంగరాలు దొరుకుతున్నాయిగాని వీటికి భిన్నంగా మట్టి తో చేసే బొంగరాలు ఉండేవి.  చిన్నప్పుడు మట్టి బొంగరాలను స్వయంగా చేసుకుని వాటి తో పిల్లలందరం అరుగు మీద కూర్చుని బొంగరాల పోటీలు పెట్టుకునే వాళ్ళం. ఈ విషయంలో 'మారంపూడి వాన' గారి అబ్బాయ్ 'భాను' మా అందరికంటే ఎక్ష్ప ర్ట్. మట్టి తో ఆట వస్తువులు చెయ్యాలంటే సరైన మట్టిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. చేలకు నీళ్ళు  పెట్టడానికి కాలవకు అడ్డం వేసిన తర్వాత దానికి దిగువ భాగాన వున్న గట్టు అంచుల నుండి మట్టిని తీసుకుని దానికి కొంచెం  నల్ల (ఊకను కాల్చగా వచ్చే పొడి ) కలిపి దానితో రకరకాల వస్తువులు చెయ్యడం వాడి స్పెషల్. ఎద్దుల బండి, ట్రాక్టర్, ఆవులు, ఇల్లు., ఇలా రక రకాల వస్తువులు చేసేవాడు.

     ఇక బొంగరాల విషయానికి వస్తే.. గోళీకాయ పరిమాణంలో మట్టి ముద్దను తీసుకుని దాన్ని చేతితో వత్తుతూ నేలపై గుండ్రంగా వత్తాలి. దాన్ని పిప్పరమెంట్ బిళ్ళ ఆకారంలో తయారు చేసి దాని మధ్యలో చిటికెన వేలంత పొడవుండే  కొబ్బరి ఈన గుచ్చాలి. ఈన  గుచ్చుకున్న ప్రాంతంలో మట్టి బిళ్ళ కు  పైన కింద చిన్న బొడిపెల  వోత్తగానే మట్టి బొంగరం రెడి. దీనిపైన చిన్న తగరపు పొర ను అంటిస్తే  బొంగరం తిరిగేటపుడు కలరపుల్ వుంటుంది .

    ఈ మట్టి బొంగరాన్ని తిప్పడం కూడా ఒక టాలెంట్ అనొచ్చు. రెండు అరచేతుల మధ్య బొంగరం ఈన ను వుంచి బొంగరం క్రింది బాగంలో వున్న చిన్న ఈన కొనను నేలపై వుంచి కొంచెం  ఫోర్స్ గా తిప్పి వదిలెయ్యాలి. ౧...౨...౩... అని అంకెలు లెక్కపెట్టి అందరు తమ తమ బొంగారాలిని వొకేసారి తిప్పి వదిలెయ్యాలి. అన్ని బొంగరాల కంటే ఆఖర్న ఎవరి బొంగరం తిరగడం ఆగితే వాళ్ళు గెలిచినట్టు  లెక్క. !

     కేవలం పిల్లలే ఆడక్కర్లేదు. మీ పిల్లలతో పోటీపడి ఆడితే కాసేపు మీరు కూడా చిన్న పిల్లలైపోవచ్చు .

Share This:

3 కామెంట్‌లు to ''మట్టి బొంగరం!"

ADD COMMENT