పది కోతులకు ఒకే కొబ్బరి కాయ
'కోతికి కొబ్బరికాయ దొరికినట్టు..' అని అప్పుడప్పుడు మనం అంటుంటాం.ఆ కొబ్బరికాయ దొరికినప్పుడు ఆ కోతి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఈ సామెతను కొంచెం మనం మాడిఫై చేస్తే అదే కొబ్బరికాయ పది కోతులకు దొరికితే దేని మానాన అది ఆ కొబ్బరికాయతో హడావిడి చేసే ఛాన్స్ వుంటే ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! ఔత్సాహిక సృజనాత్ములు కొందరు 2012 లో యుగాంతం కాన్సెప్ట్ ని పట్టుకుని హైదరాబాద్ ని ఆ సమయంలో ఊహించుకుని ఒక షార్ట్ ఫిల్మ్ తయారుచేసారు. ఈ పాటికే మీకు అర్ధమయ్యి వుంటుంది ఆ కొబ్బరికాయ ఏమిటో, ఆ కోతులేమిటో...! సేటిలైట్ విధి (హతివిది అనలేమిక్కడ) ఆ గ్రాఫిక్స్ విజువల్స్ ని తీసుకుని మన న్యూస్ చానల్స్ ఏ రేంజ్ లో రేచ్చిపోవాలో ఆ రేంజ్లో రెచ్చిపోయాయి. చానల్ రేంజ్ ని బట్టి రకరకాల అర్ధాలు వచ్చేలా క్యాప్షన్స్, హెడ్లైన్స్ .. ! బొంగురుపోయిన గొంతులకు మరింత బేస్ పెంచి వాయిస్ ఓవర్స్ ... ! అసలే ఈ మధ్య కాలంలో వనస్థలిపురంలో అంతుచిక్కని శబ్దాలకు జనం హడలి చస్తుంటే దానిని కూడా ఈ రొంపిలోకి లాగేసి ఇవి ఆ యుగాంతానికి సూచనలేనా అని సొంత పైత్యం జోడించి మరింత హడావిడి. సేటిలైట్ విధి (ఇక్కడ కూడా హతివిది అనలేము). చివరగా నేను చెప్పొచ్చేదేంటంటే భగవంతుడు సృష్టించిన చావులాంటిది ఏదైనా వుంటే అది ఒకేసారి పోయేలా వుంటుంది కాని ఇంతటి నరకంగా మాత్రం కాదు. కోతినిసృష్టించింది దేవుడే.. కొబ్బరికాయను సృష్టించింది దేవుడే.. కాని ఇలా దాని హడావుడితో ఎదుటివాళ్ళను చంపమని మాత్రం కాదు.!

you have expressed view what exactly in my mind ..
రిప్లయితొలగించండి